న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వెల్లడించిన బ్యాంకు రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో అధికార బీజేపీకీ సన్నిహితంగా మెలిగేవారే ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. భారీ మొత్తంలో బ్యాంకు రుణాలను ఎగవేసిన 50 మంది పేర్లను చెప్పాలని తాను పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారని రాహుల్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆర్‌బీఐ వెల్లడించిన జాబితాలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితర బీజేపీ సన్నిహితులు ఉన్నారని, అందుకే ప్రభుత్వం పార్లమెంట్‌లో వాస్తవాలను కప్పిపుచ్చిందని రాహుల్ ట్వీట్ చేశారు.
ఢీఫాల్టర్లలో బీజేపీ సన్నిహితులే ఎక్కువ: రాహుల్‌గాంధీ