హైదరాబాద్: ముంతాజ్ కోసం షాజహాన్ .. తాజ్‌మహల్ కట్టించాడు. ఆ పాలరాతి కట్టడం .. ప్రపంచ అద్భుతం. ఏడు వింతల్లో ఇదోకటి . ఆ సుందర ప్రదేశాన్ని ఇవాళ అమెరికా ప్రథమ దంపతులు సందర్శించారు. సూర్యాస్తమయ వేళ.. ట్రంప్ ఫ్యామిలీ ఆ అమోఘ కట్టడాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. యూపీలోని ఆగ్రాలో ఉన్న ఆ ముగ్ధమనోహర ప్రేమ చిహ్నాన్ని.. ట్రంప్, మెలానీయాలు ఆసక్తిగా తిలకించారు. అహ్మాదాబాద్ నుంచి ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులు.. ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో తాజ్‌మహల్ చేరుకున్నారు. తొలుత సందర్శకుల పుస్తకంలో తమ అభిప్రాయాలను రాశారు. తాజ్ లాన్‌లో తిరిగారు. తాజ్ ముందు ఫోటోలకు ఫోజు ఇచ్చారు. గైడ్ వివరించిన సంగతలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు ట్రంప్ దంపతులు.
చేతిలో చేయేసి.. తాజ్‌మహల్ వీక్షించిన ట్రంప్ జోడి