విశాఖపట్నం: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. ఈరోజు ఆంద్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి మొక్కలు నాటాలని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో మంచి ఆక్సిజన్ కావాలి అంటే 15 నిమిషాల కి 300 రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆలాంటి పరిస్థితి మనకు రావద్దు అంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటలి అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చొరవ చూపుతున్నా రోజాకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మన జీవితానికి సరిపడే ఆక్సిజన్ మూడు మొక్కల నుండి వస్తుంది ఆ మూడు మొక్కలు నాటి వాటిని పెంచి మన ఆక్సిజన్ మనం ఉత్పత్తి చేసుకోవాల్సిందిగా కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజావనం ద్వారా నిన్న తమిళనాడు లో, ఈ రోజు విశాఖపట్నం లో మొక్కలు నాటిస్తున్న ఎమ్మెల్యే రోజా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ లకు ప్రత్యేకంగా అభినందించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మాడుగుల ఎమ్మెల్యే